Telugu Updates
Logo
Natyam ad

గోదారమ్మకు సీఎం కేసీఆర్ శాంతిపూజ.!

భద్రాచలం: వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. భారీ వర్షాలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం ఏరియల్ సర్వే రద్దయింది. దీంతో కేసీఆర్ వరంగల్ నుంచి రోడ్డుమార్గంలోనే భద్రాచలం వచ్చారు. తొలుత వంతెనపై నుంచి గోదావరి పరిసరాలను సీఎం పరిశీలించారు. వరదకు సంబంధించిన వివరాలు.. యంత్రాంగం చేపట్టిన చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గోదారమ్మకు శాంతిపూజ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకునేందుకు తీసుకోనున్న చర్యలపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు..