Telugu Updates
Logo
Natyam ad

నడిరోడ్డు మీద మంత్రి డ్యాన్స్

నల్గొండ జిల్లా మునుగోడు: మంత్రి తలసాని ఆధ్వర్యంలో నాలుగున్నర వేల కార్లు నగరం నుంచి మునుగోడుకు వెళ్తుండడంతో రోడ్లన్నీ కార్లతో నిండిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా మునుగోడుకు బయలుదేరారు. కాగా మంత్రి మల్లారెడ్డి రోడ్డుపై తాను వెళ్తున్న కారు మీదకెక్కి డ్యాన్స్ చేశారు. చుట్టూ వందలాది వాహనాలు ట్రాఫిక్ ఇరుక్కుంటే డ్యాన్సులు చేయడం బాధ్యతారాహిత్యమని ప్రజలు మండిపడ్డారు.